Monday, April 30, 2012

సృజనోత్సవం

సృజనోత్సవం

జన విజ్ఞాన వేదిక వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నుండి నాల్గు రోజుల పాటు 8, 9, 10 వ తరగతి విద్యార్థుల కోసం " సృజనోత్సవం " బాలల విజ్ఞాన వినోదం - చేసి చూద్దాం! నేర్చుకుందాం! కార్యక్రమం విజ్ఞాన్ హైస్కూల్, నక్కలగుట్ట - హన్మకొండ యందు ప్రారంభమయ్యాయి. ప్రారంభసభ జెవివి జిల్లా అధ్యక్షులు డాక్టర్. ఎం. రాములు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిధి గా జిల్లా సైన్సు అధికారి  సి. హెచ్. కేశవరావు, అతిథిలుగా ప్రో. కే. లక్ష్మారెడ్డి జెవివి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రో. ఎ. రామచంద్రయ్య చెకుముకి మాస పత్రిక సంపాదకులు, ఎన్. నారాయణ రెడ్డి విజ్ఞాన్ విద్య సంస్థల చైర్మన్, ఎం. బాబురావు విజ్ఞాన్ హైస్కూల్ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు. కార్యక్రమ విశిష్టత గూర్చి ఎం. ఎస్. రంగాచారి, జెవివి జిల్లా శాస్త్ర ప్రచార కన్వీనర్ వివరించారు. 140 మంది విద్యార్థులు ఈ నాల్గు రోజులపాటు పాల్గొంటారు. ఈ విద్యార్థులను నాల్గు గ్రూపులు   1.  క్యురీ, 2.  డార్విన్, 3. రామన్, 4. రామానుజన్  గా చేసారు.  విద్యార్థులు  రోజుకొక కార్నర్ 1. జీవశాస్త్రం, 2. రసాయనశాస్త్రం, 3.  భౌతిక శాస్త్రం, 4.  గణితశాస్త్రం  లకు  వెళ్తారు. విద్యార్థులందరూ "ప్రయోగాలు చేయడం " ద్వారా సైన్సు ను నేర్చుకొంటారు. రిసోర్సుపర్సన్  లుగా ఎం. వెంకటేష్, కే. రవికుమార్, సంపత్, పి. మహేంద్రం, కే. సందీప్ కుమార్, సదానంద్ ఈశ్వర్, జే. దయాకర్, టి. సత్యనారాయణ, కే. కృష్ణారావు, ఇ. చంద్రశేకర్, బి. రమేష్, ఎస్. ఆనందం, ఎం. వి. గిరిధరాచారి, జి. ఎస్. వాణి, డాక్టర్ ఎ. విద్యాదేవి, డాక్టర్ డి.ప్రభాకరా చారి  లు వ్యవహరించారు. ఈ సృజనోత్సవ కార్యక్రమాన్ని ఎం. ఎస్. రంగాచారి జెవివి జిల్లా శాస్త్ర ప్రచార కన్వీనర్, టి. శ్రీనాథ్, జెవివి జిల్లా కోశాధికారి, కే. బి. ధర్మ ప్రకాష్, జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి, డాక్టర్. ఎం. రాములు, జెవివి జిల్లా అధ్యక్షులు పర్యవేక్షిస్తున్నారు. సాయంత్ర౦ 4 గం. నుండి 5 గం. వరకు విద్యార్థుల సందేహాలకు  ప్రో. ఎ. రామచంద్రయ్య చెకుముకి మాస పత్రిక సంపాదకులు సమాదానాలిచ్చారు.